BDK: కొత్తగూడెం జిల్లా చర్మకారుల సంఘం ప్రముఖ నాయకుడు సత్యాల వెంకన్న (రెడ్డి) శుక్రవారం కన్నుమూశారు. పట్టణంలోని 26వ డివిజన్‌కు చెందిన ఆయన, సూపర్ బజార్ సమీపంలో నివసిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. చర్మకారుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన వెంకన్న మృతి పట్ల స్థానిక ప్రజలు, సంఘ సభ్యులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.