MLG: జిల్లాలో కుల గణన సర్వేలో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని శుక్రవారం స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి మధుసూదన్ డిమాండ్ చేశారు. సర్వే పూర్తై 18 నెలలు గడిచినా నిధులు మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి తక్షణమే భత్యం చెల్లించాలని కోరారు.