MDCL: మల్కాజ్గిరి కార్పొరేషన్ వ్యాప్తంగా దోమల నివారణ కోసం రంగంలోకి స్పెషల్ బృందాలను దింపినట్లు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. యాంటీ లార్వా ఆపరేషన్, ఆయిల్ బాల్ సీడింగ్, ఫాగింగ్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేపటి నుంచి విస్తృతంగా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టనున్నట్లుగా ఆయన వివరించారు. ప్రతి కాలనీనీ కవర్ చేస్తామన్నారు.