MBNR: అభ్యాస అకాడమీ నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యా పోటీల్లో దేవరకద్రకు చెందిన మాధురి – రమేష్ దంపతుల కుమార్తె విద్య ద్వితీయ ర్యాంకు సాధించింది. మహబూబ్ నగర్లోని సంస్కార్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని, తన ప్రతిభతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. ఈనెల 14న HYDలో జరిగే కార్యక్రమంలో బహుమతి అందుకోనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.