MHBD: మహబూబాబాద్ పట్టణంలో దివ్యాంగుల అభ్యున్నతి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు. శుక్రవారం దివ్యాంగులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు, అర్హులైన వారికి 100 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగులు పరస్పరం వివాహం చేసుకుంటే ప్రభుత్వం తరఫున రూ. లక్ష ఆర్థిక సహాయం అందుతుంది.