జగిత్యాల పట్టణంలో గంజాయి విక్రయానికి వచ్చిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగేంద్ర నగర్లో సమాచారం మేరకు ఎస్సై సుప్రియ సిబ్బందితో కలిసి తనిఖీ చేసి అదిలాబాద్ జిల్లా కప్పర్ల గ్రామానికి చెందిన కొత్తూరి అఖిల్, దర్శనాల అభిలాష్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.