పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ ఆహార ధరల సూచీ ఆరునెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెందిన FIO ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతర్జాతీయ ఆహార ధరలు ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 2.4 శాతం పెరిగి, 128.5 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. వంట నూనె, చక్కెర, గోధుమల ధరలు పెరిగాయి.