KMR: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల ఇంటి యజమానులు తమ ఆస్తి (ఇంటి పన్ను)ను సకాలంలో చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ కోరారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. 2026-27ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నును ఏప్రిల్ 30 లోపు చెల్లిస్తే 50 శాతం డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు.