ASF: సిర్పూర్-టి మండల కేంద్రంలోని హజ్రత్ సయ్యద్ తాలిబ్ అలీ షా బాబా దర్గా 81వ ఉర్సు ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహించనున్న ఈ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే దుకాణాల కోసం ఆదివారం సాయంత్రం 5 గంటలకు దర్గా ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఆసక్తి గల వ్యాపారులు ఈ వేలంలో పాల్గొనాలని కోరారు.