భారత్‌లో డంకిన్ డోనట్స్ వ్యాపారం ముగియనుంది. జుబిలెంట్ ఫుడ్ వర్క్స్‌తో ఉన్న ఒప్పందం 2026 డిసెంబర్‌తో ముగియనుండటమే దీనికి కారణం. ఆశించిన లాభాలు రాకపోవడంతో ఈ బ్రాండ్‌ను పొడిగించేందుకు జుబిలెంట్ మొగ్గు చూపలేదు. దీంతో దశలవారీగా స్టోర్లను మూసివేయనున్నారు. డొమినోస్ వంటి ఇతర లాభదాయక బ్రాండ్లపైనే ఇకపై ఆ సంస్థ దృష్టి సారించనుంది.