MNCL: వయోవృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు పునరుద్ధరించాలని వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య కోరారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ రాయితీలు ఉండేవని, ప్రస్తుతం ఆ సౌకర్యం లేకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.