MLG: ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ దివాకర టీఎస్ చేతుల మీదుగా శనివారం కేవీపీఎస్ డైరీ ఆవిష్కరణ జరిగింది. రాష్ట్ర సహాయ కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ.. ఏప్రిల్‌ను మహనీయుల మాసంగా నిర్వహించాలని తెలిపారు. బాబు జగ్జీవన్ రావు, జ్యోతిరావు ఫూలే, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతులను ఘనంగా నిర్వహించి వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.