TG: నాగర్కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫర్హాబాద్ చౌరస్తా సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫారెస్ట్ సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ మేరకు అటవీ ప్రాంతంలోని జంతువులకు ముప్పు వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.