BHNG: ఈనెల 7న భూదాన్ పోచంపల్లిలో నిర్వహించనున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలని, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ రైతులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతాంగ సమస్యలపై ఇప్పటివరకు రైతు సంఘం అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు.