SDPT: రంగదాంపల్లిలోని రాజేశ్వర వైన్స్లో దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన శ్రీకాంత్ రెడ్డి, రెహమాన్, చందు వైన్స్ నుంచి 33 మద్యం బాటిళ్లు, 7 బీర్లను దొంగిలించారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వస్తుండగా వీరిని పట్టుకున్నామని, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.