GDWL: ధరూర్, కేటీ దొడ్డి మండలాల్లో ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. కర్ణాటక బూడిదపాడు నుంచి వందల ట్రాక్టర్లలో అక్రమ ఇసుక తరలిస్తూ సొమ్ము సంపాదిస్తున్నారు. దీనివల్ల భూగర్భజలాలు తగ్గి సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.