AP: రాజధాని పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల అగ్నిప్రమాదాల్లో నిర్మాణ సంస్థల తీరును తప్పుబట్టారు. సామగ్రికి రక్షణ కల్పించే బాధ్యత కాంట్రాక్టు సంస్థలకు లేదా? అని ప్రశ్నించారు. వారి నిర్లక్ష్యంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగితే అలర్ట్ చేయాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు.