MDK: హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 నుంచి 11 వరకు వారం రోజులపాటు హెల్త్ వీక్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.