BDK: సర్కారు బడుల్లో విద్యార్థులకు ఇప్పటికే యూనిఫామ్, నోట్ బుక్స్, పుస్తకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, అదనంగా షూ, బెల్ట్, రెండు జతల సాక్సులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 12 నుంచే అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు KGBV, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు18 రకాల వస్తువులు ఇవ్వనున్నారు.