SDPT: ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు ‘అన్సైట్ FIR’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. హత్యాయత్నం, దోపిడీ, మహిళలు, చిన్నారులపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు వంటి కేసుల్లో బాధితుల వద్దకే వెళ్లి FIR నమోదు చేస్తారని చెప్పారు. దీంతో ఆధారాల సేకరణ వేగవంతమై, నిందితుల పట్టివేత సులభమవుతుందని పేర్కొన్నారు.