సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో వస్తున్న భారీ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని ఒక ప్రత్యేక గీతం కోసం బాలీవుడ్ పాపులర్ సింగర్ బాబుల్ సుప్రియోని ఎంచుకున్నట్లు కీరవాణి తెలిపాడు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. పాట రికార్డింగ్ పూర్తయిందని వెల్లడించాడు.