ఐపీఎల్లో భాగంగా రేపు ఆదివారం కావడంతో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ వేదికగా జరిగే సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఇక రాత్రి 7:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హై-వోల్టేజ్ పోరు జరగనుంది.