JGL: హైదరాబాద్ గచ్చిబౌలిలోని NITHMలో ట్రాన్స్జెండర్లకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు కార్ డ్రైవింగ్, హోటల్ మేనేజ్మెంట్, డ్రోన్ పైలట్ శిక్షణలు అందిస్తారు. 91 మందికి లబ్ధి చేకూరే ఈ కార్యక్రమానికి రూ. 17.72 లక్షలు ఖర్చు చేస్తున్నారు.