HNK: దామెర మండలం ఒగ్లాపూర్కు చెందిన పోలు రాజు (31) భార్య ఏడాదిగా దూరంగా ఉండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.