రేపు ఉప్పల్ స్టేడియంలో జరిగే SRH vs LSG మ్యాచ్కు వచ్చే అభిమానులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియంలోకి పవర్ బ్యాంకులు, ల్యాప్టాప్లు, కెమెరాలు, సిగరెట్లు, లైటర్లు, పెన్నులు, వాచీలు, హెడ్సెట్స్, బ్యానర్లను అనుమతించరు. నీళ్ల సీసాలు, బయటి ఆహారానికి కూడా అనుమతి లేదు. కేవలం మొబైల్ ఫోన్లకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.