ADB: బజార్హత్నూర్ మండలంలోని భోస్ర గ్రామంలో నిర్వహిస్తున్న అఖండ శివ నామ సప్తాహం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో భక్తులతో కలిసి పూజ కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామంలోని సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.