భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ యూనిట్ అయిన ‘ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమరియా’ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 టెన్యూర్ బేస్డ్ డెంజర్ బిల్డింగ్ వర్కర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. నెలకు రూ.19,900 ప్రాథమిక వేతనంతో పాటు కరవు భత్యం (DA) & ఇతర ప్రయోజనాలు ఉంటాయి.