NRPT: మక్తల్‌లోని దండు మలుపు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఊట్కూర్ మండలానికి చెందిన మెకానిక్ చాపలి కృష్ణ తన బైక్ పై వెళ్తుండగా, వేగంగా వచ్చిన కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.