SRD: చౌటకూర్ సమీపంలోని 161వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని రేణుక ఎల్లమ్మ దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న మారుతి కారు (TS 07 HE 7905) ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.