బాలీవుడ్ నటి నోరా ఫతేహికి మహిళా కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాట వివాదంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయగా, ఆమె తన లాయర్‌ను పంపించింది. దీనిపై మహిళా కమిషన్ ఛైర్పర్సన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘లాయర్లు చెబితే కుదరదు.. నువ్వు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈనెల 27న రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.