AP: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. అచ్చెన్నాయుడి విమర్శలకు సమాధానం చెప్పలేక బొత్స మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుపై 30 ఏళ్లుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కుటుంబాన్ని అవమానిస్తే.. అసెంబ్లీలో బొత్స ఎందుకు ఖండించలేదని తెలిపారు.