MHBD: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన మహంకాళి మైసయ్య ఇటీవల అకాల మరణం చెందారు. అయన కుటుంబానికి 1985-86 బ్యాచ్‌కి చెందిన పదవ తరగతి బాల్య మిత్రులు గురువారం రూ. 52,000 నగదు, 25 కేజీల బియ్యం, కిరాణా సామాన్లు అందించారు. మానవత్వం కనుమరుగవుతున్న నేటి సమాజంలో చదువుకున్న స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్నారు.