దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన UPI నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. 2016లో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు 50 కోట్ల మంది వినియోగదారులతో ప్రపంచంలోనే అతిపెద్ద చెల్లింపుల వ్యవస్థగా ఎదిగింది. చిరు వ్యాపారుల నుండి మాల్స్ వరకు నగదుతో పనిలేకుండా కేవలం స్కాన్‌తో క్షణాల్లో చెల్లింపులు చేసేలా మన జీవనశైలిని మార్చేసి, భారత డిజిటల్ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది.