RR: శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫూలే సంఘసంస్కర్త, స్త్రీల విద్య కోసం 1848వ సంవత్సరంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.