NZB: సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1,16,000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు మైలారం గ్రామ సర్పంచ్ సర్దాన్ సదానంద్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కైరి సాయ గౌడ్, రావుట్ల రాజశేఖర్, భూదేవి, అక్కినపల్లి శంకర్లు రూరల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు రావుట్ల చిన్న గంగాదాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.