MNCL: చెన్నూరు పట్టణంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఫూలే దంపతుల విగ్రహాలకు బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు తుమ్మ శ్రీ పాల్, రాజశేఖర్ గౌడ్, 18వ వార్డు కౌన్సిలర్ ఏతం శివకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి కాయిత వెంకటేష్, మాణికరావు శంకర్ పాల్గొన్నారు.