గుంటూరు జిల్లా ఎస్టీయూ నేతలు పాఠశాల విద్యాశాఖ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తమీమ్ అన్సారియాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్మెంట్ పెండింగ్ బిల్లుల గురించి వివరించారు.