TG: మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘సామాజిక న్యాయం, సమాన అవకాశాలు – ఇది పూలే ఆలోచన.. మా ప్రజా ప్రభుత్వ ఆచరణ’ అంటూ పేర్కొన్నారు. ఫూలే ఆశయాల బాటలోనే తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం పేర్కొన్నారు.