పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.