MHBD: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. 6వ వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ ఛైర్పర్సన్ పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.