NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి పైఅమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించిన సందర్భంగా సంకష్టహర చతుర్థి నాడు ఇంద్రకీలాద్రిలో గణపతి, నవచండీ హోమాలు నిర్వహించారు. ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ), ఈవో వి.కె. శీనానాయక్ పాల్గొన్నారు. ఉదయం పూర్ణాహుతి నిర్వహించి, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు.