AP: క్రైస్తవులకు సీఎం చంద్రబాబు ఈస్టర్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్ పండగ ప్రేమ, విశ్వాసం, నమ్మకం లాంటి పవిత్ర భావనలను పాదుగొలిపే పవిత్ర రోజు అని సీఎం తన ‘X’ ఖాతాలో పోస్టు పెట్టారు. పాప ప్రక్షాళన కోసం క్రీస్తు చేసిన త్యాగం మనకు ఆదర్శం కావాలని, ఆయన చూపిన శాంతి మార్గంలో నడుస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు కలకాలం ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.