AP: రాష్ట్ర ప్రజలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈస్టర్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ‘సత్యం, కరుణ ఎప్పటికీ ఓడిపోవన్న సత్యాన్ని ఏసుక్రీస్తు పునరుత్థాన తెలుపుతుంది. ఈస్టర్ పండగ ప్రతి ఇంటినీ ప్రేమ, ఆశ, శాంతి, శ్రేయస్సుతో నింపాలని కోరుకుంటున్నా. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.