ADB: శాంతినగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 7న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జె.సంగీత తెలిపారు. టీఎస్కేసీ ఆధ్వర్యంలో టాస్క్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సౌజన్యంతో జరిగే ఈ మేళాలో 15 వరకు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.