ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా గురించి గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోందని తెలిపాడు. తాను ఇప్పటికే రెండు పాటలు పూర్తి చేశానని చెప్పాడు. ప్రభాస్ క్యారెక్టర్ ‘మాస్’గా ఉంటుందని, పాటలు చాలా ‘క్లాస్’గా ఉంటాయని పేర్కొన్నాడు.