MHBD: బయ్యారం మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా సంకపల్లి సుమన్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బానోత్ స్వామి, ప్రధాన కార్యదర్శిగా ధారావత్ వెంకట్రాం, సహాయ కార్యదర్శిగా చామర్ది వినయ్, కోశాధికారిగా భూక్యమంగు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పాముల విద్యాసాగర్, సపావట్ సంతోష తదితరులు ఎన్నికయ్యారు.