ASF: కాగజ్ నగర్ పట్టణంలోని చింతగూడ చౌరస్తా వద్ద ఇవాల నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో MLA హరీష్ బాబు పాల్గొన్నారు. వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. MLA మాట్లాడుతూ.. చింతగూడ చౌరస్తాకు బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాగా నామకరణం చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. చౌరస్తా అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు కేటాయించామన్నారు.