MBNR: పట్టణంలోని చర్చిల అభివృద్ధికి రూ. 2.42 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కల్వరికొండపై జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఒక్క చర్చి సుందరీకరణకే ప్రత్యేకంగా రూ. 150 లక్షలు కేటాయించామని తెలిపారు. ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, క్షమాగుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయన కోరారు.