KMM: ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్‌రామ్ ఆశయాల బాటలో నడవడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని ఆయన అన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగిస్తోందని భట్టి పేర్కొన్నారు.