GDWL: గద్వాల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో ఆదివారం 1972-74 ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్వ విద్యార్థుల సంచికను ఆవిష్కరించి, తాము కూడా ఇక్కడ చదివిన అనుభవం గుర్తుచేసి వారిని సత్కరించి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.